Liger : కోలుకోవడం కష్టమేనా..?

గత రెండు రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసిన ఒక్కటే వినిపిస్తుంది. అదే లైగర్. భారీ బడ్జెట్, అంత కంటే భారీ అంచనాలతో ఈ సినిమా గురువారం పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. అయితే ఈ సినిమాకు ఒక తెలుగులోనే కాదు.. ఎక్కడ కూడా పాజిటివ్ రివ్యూలు రాలేదు. 180 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా నుంచి కలెక్షన్లు భారీ మొత్తంలో వస్తాయని మేకర్స్ ఊహించారు. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు.

తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3000 స్క్రీన్ లలో విడుదలైన లైగర్.. కేవలం 33.12 కోట్లనే వసూళ్లు చేసింది. నిజానికి ఒక సినిమాకు తొలి రోజు ఇలాంటి కలెక్షన్లు రావడం శుభారంభం అంటారు. కానీ, లైగర్ కు మాత్రం అలాంటి మాటలు వినపడటం లేదు. తొలి రోజు డిజాస్టార్ టాక్ రావడంతో తర్వాత రోజులలో థియేటర్లు వద్ద సందడి ఉండదు. ఫలితంగా కలెక్షన్లు నత్త నడకన వస్తాయి.

అలాగే తొలి రోజు కేవలం సౌత్ నుంచే 30 కోట్ల నుంచి 33 కోట్ల వరకు కలెక్షన్లు వస్తాయని మేకర్స్ గట్టిగా నమ్మారు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కలెక్షన్లు రావడం నిర్మాతలకు, బయ్యర్లకు పెద్ద నష్టమే అని చెప్పొచ్చు. నిజానికి లైగర్ సినిమా సమయంలో పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్ బడ్జెట్ విషయంలో చాలా కష్టపడినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే లైగర్ పై వీళ్లు చాలా హోప్స్ పెట్టుకున్నారు. లైగర్ కలెక్షన్లు లాభదాయకంగా ఉంటాయని, అలా వచ్చిన డబ్బులతోనే పూరీ తర్వాత ప్రాజెక్ట్ జన గణ మన తెరకెక్కిస్తామని చెప్పారు.

- Advertisement -

అంతే కాదు.. లైగర్ కంటే డబుల్ బడ్జెట్ తో జన గణ మన వస్తుందని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితులు జన గణ మన మూవీపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. అలాగే లైగర్ నష్టాల నుంచి కూడా అప్పుడప్పుడే కోలుకోవడం కూడా కష్టమే అని అర్థమవుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు