Nithya Menen : ప్రెగ్నెంట్ ?

నిత్యామీనన్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరును పెద్దగా పరిచయం చేయవలసిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో నిత్యామీనన్ కూడా ఒకరు. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. భీమ్లా నాయక్ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చింది. ఒకప్పుడు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న నిత్యమీనన్ ప్రస్తుతం సెలక్టెడ్ గా సినిమాలను చేస్తోంది. అయితే తాజాగా నిత్యామీనన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ గా మారింది.

పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తున్న ప్రెగ్నెన్సీ కిట్ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది నిత్యమీనన్. అంతేకాక ” అద్భుతం మొదలైంది” అనే క్యాప్షన్ ని జోడించి లవ్ ఎమోజీలను జత చేసింది. దీంతో అభిమానులు, నెటిజన్లు షాక్ అయ్యారు. పెళ్లి కాకుండానే గర్భవతి కావడం ఏమిటని ఆరా తీయడం మొదలుపెట్టారు. నెటిజెన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

అయితే అసలు విషయం ఏమిటంటే.. నిత్యామీనన్ తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా ఆ ఫోటోను పంచుకుందట. మలయాళీ నటి పార్వతి తో కలిసి నిత్యమీనన్ నటిస్తున్న తాజా చిత్రం ” వండర్ వుమెన్”. ఈ సినిమాని ప్రమోట్ చేసేందుకే నిత్యామీనన్ తో పాటు పార్వతి ప్రెగ్నెన్సీ కిట్ ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ చిత్రంలో పార్వతి, నిత్యామీనన్ గర్భం దాల్చిన యువతులుగా కనిపించబోతున్నారట. ఈ మలయాళీ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు