Pushpa 2 : పుష్ప 2 లో విలన్ గా జగపతి?

పుష్ప ది రైజ్, 2021 సంవత్సరం డిసెంబర్ మాసంలో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా హిట్ కావడంతో అల్లు అర్జున్ స్థాయి ఎక్కడికో వెళ్ళింది. అంతేకాదు ఈ సినిమాకు అలాగే ఇందులో నటించిన యాక్టర్లకు మంచి అవార్డులు కూడా వచ్చాయి. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులంతా ఆసక్తిగా పుష్పది రూల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్ లో కనిపించి నట విశ్వరూపాన్ని చూపించారు. ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులే పుష్ప 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ ఇప్పుడు వైజాగ్ లో జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.
తాజాగా మరో నటుడిని కూడా దింపబోతున్నట్లు సమాచారం. అతను ఎవరో కాదు సుకుమార్ నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన జగపతిబాబుని ఇప్పుడు పుష్పా 2 సినిమాలో కూడా తీసుకోబోతున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో జగపతి బాబుకి ఒక మంచి పాత్ర రాశాడట సుకుమార్. మొదటి భాగంలో ఎలాగో ఛాన్స్ ఇవ్వలేదు, కానీ రెండో భాగంలో ఫాహధ్ తో పాటు మరో బలమైన విలన్ ఉండాలని సునీల్ కి జతగా జగపతిబాబును కూడా దించుతున్నారట.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు