Jagapathi Babu : లోకం అర్థమైందా ?

టాలీవుడ్ సీనియర్ హీరోలలో జగపతి బాబు ఒకరు. ప్రారంభంలో ఆయనను డబ్బింగ్ కూడా చెప్పుకోలేడు అని అన్నారు. కానీ ఇప్పుడు అదే వాయిస్ తో డైలాగులు చెబుతుంటే అబ్బో అనుకుంటున్నారు. నటన రాదు, ఇండస్ట్రీలో నెట్టుకురావడం కష్టమే అని చాలా మంది అన్నారట.  కానీ ఆ నటుడే ఏకంగా  7 నంది అవార్డులను అందుకోవడం విశేషం. ప్రస్తుత తరుణంలో సినీ ఇండస్ట్రీలో రెండు, మూడేళ్లు ఉంటేనే గగనంగా భావిస్తున్న తరుణంలో ఆయన ఏకంగా 33 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం విశేషం. 

ఎన్నో సినిమాల్లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరువాత జగపతి బాబు అవకాశాలు దొరికినప్పుడల్లా హీరో పాత్రలు చేస్తూనే.. మరోవైపు విలన్ గా చాలా సినిమాల్లో నటించాడు. ఇటీవల వచ్చిన  ప్రతీ సినిమాలో కూడా జగపతి బాబు విలన్ గా నటించారు. కొన్ని సినిమాల్లో విలన్ గా నటించకపోయిన కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రెండేళ్ల కిందట ‘పటేల్ సర్’ అనే సినిమా చేయగా.. తాజాగా రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి రుద్రంగి  కాగా.. మరొకటి “సింబా ది ఫారెస్ట్ మ్యాన్” సినిమా చేస్తున్నాడు. 

జగపతి బాబు ప్రధాన పాత్రలో రుద్రంగి సినిమాలో నటిస్తున్నాడు. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రాంతంలోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జాలి, దయ లేని భీమ్ రావు దొరగా జగపతి బాబుని ఇప్పటికే పరిచయం చేశారు. 

- Advertisement -

మరో సినిమాకి  దర్శకుడు సంపత్ నంది అందించిన కథతో మురళి మనోహర్ దర్శకత్వంలో సింబా ది ఫారెస్ట్ మ్యాన్ సినిమా వస్తోంది. చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపే చిత్రంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా జగపతి బాబు సోషల్ మీడియాలో రివర్స్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇలా అయినా ఈ లోకం అర్థమవుతుందేమోనని చూస్తున్నా అని క్యాప్షన్ ఇవ్వడం విశేషం. జగపతి బాబు ఏ సందర్భంలో ఈ పోస్ట్ పెట్టాడనేది మాత్రం ఎవరికీ అర్థం కాకపోవడం విశేషం. 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు