Jai Balayya: మాస్ ట్రీట్

నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు చాలా సందర్భాలలో జై బాలయ్య అని నినాదాలు చేస్తారు మరియు వారికి నిజంగా జై బాలయ్య అనేది ఒక ఎమోషన్.కొన్ని సార్లు సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా జై బాలయ్య అని నినాదాలు చేస్తుంటారు.నేడు “వీర సింహారెడ్డి” చిత్ర బృందం జై బాలయ్య అనే మొదటి సింగిల్ లిరికల్ వీడియోతో రిలీజ్ చేసారు. ఇది అభిమానులకు మంచి ట్రీట్ అని చెప్పొచ్చు.

బాలకృష్ణకు అఖండతో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ అందించిన ఎస్ థమన్ ఎనర్జిటిక్ బీట్స్‌తో డైనమిక్ నంబర్‌ను స్కోర్ చేశాడు. కథానాయకుడి గొప్పతనాన్ని కీర్తిస్తూ సాగే ఈ పాటలో బాలకృష్ణ క్లాస్‌గా, గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటలోని మరో పెద్ద ఆకర్షణ ఏమిటంటే, థమన్ అభిమానిగా ఊరా మాస్ గెటప్ లో స్టెప్స్ వెయ్యడం, అలానే థమన్ హావభావాలు కూడా ఆకట్టుకుంటున్నాయి.

మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని బాలకృష్ణను మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వీరసింహారెడ్డి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు