James Cameron: అవతార్-6,7 కూడా తీస్తా

2009లో వచ్చిన అవతార్ ఎంతో పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన కొత్త ప్రపంచం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత పార్ట్ 1 కు సీక్వెల్ గా అవతార్ పార్ట్ 2 రాబోతుంది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ అనే పేరుతో పార్ట్ 2 జేమ్స్ కామెరూన్ తెరకెక్కించారు. మొదటి పార్ట్ లో భూమి గురించి ఉంటే.. రెండో పార్ట్ లో నీటి గురించి ఉండబోతుందని ఇప్పటికే వచ్చిన ట్రైలర్ తో తెలుస్తుంది.

భారీ అంచనాల ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా 160పైగా భాషల్లో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా విడుదల తేదీ సమీపిస్తున్న సందర్భంగా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్ సిరీస్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవతార్ ను ప్రేక్షకులు ప్రేమిస్తే అవతార్-6, 7 భాగాలు కూడా చేయడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. అందుకు తన వద్ద స్టోరీలు కూడా రెడీగా ఉన్నాయని ప్రకటించారు.

అయితే తాను అవతార్6,7 పార్ట్ లు చేయడం.. అవతార్ 2పై ప్రేక్షకాదరణ, బిజినెస్ పరంగా సమీకరణలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా జేమ్స్ కామెరూన్ అవతార్ 2 చిత్రీకరణ సమయంలోనే 4, 5 భాగాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన అవతార్ 3 2024లో విడుదల కానుంది. అలాగే 4వ భాగం షూటింగ్ కూడా కొంత వరకు జరిగిందని డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఇది వరకే ప్రకటించారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు