Japan : కార్తీతో రెండోసారి.. ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా..

తెలుగు సినిమాలో ఐటమ్ సాంగ్ కి ఉన్నంత క్రేజ్ మారే సాంగ్ కి ఉండదు. అలాంటి ఐటెం సాంగ్స్ లో మనకి నచ్చిన హీరోయిన్స్ ఉంటే ఆ కిక్ ఏ వేరు. ఆ దారిలోనే వెళ్లి ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు మన టాలీవుడ్ హీరోయిన్స్. ఇప్పుడు వారి బాటలోనే మరో స్టార్ హీరోయిన్స్ నడుస్తున్నారు.

ప్రస్తుతం మన తెలుగులో హీరోయిన్స్ లో సమంత, పూజా హెగ్డే, తమన్నా, కాజల్ అగర్వాల్ తో పాటు శృతి హస్సన్ కూడా ఐటమ్ సాంగ్స్ లో నటించారు. అలాగే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కుర్ర కారుని తన వైపు తిప్పుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. చేసింది ఒక సాంగ్ ఏ అయినా ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు.

రంగస్థలం సినిమాతో “జిల్ జిల్ జిగేలు రాజా అంటూ” రామ్ చరణ్ ఫ్యాన్స్ ను తన ఫ్యాన్స్ గా మార్చుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో “స్వింగ్ జరా” అంటూ అందరితో స్వింగ్ లు చేయంచింది తమన్నా. అలాగే ఈ మధ్య కాలంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ “గని” లో స్పెషల్ సాంగ్ ను చేసారు. ఆగడు సినిమాతో జంక్షన్ లో.. అందరితో డాన్స్ లు చేయంచింది శృతి హస్సన్. ఇప్పుడు వీరి దారి లోనే నేషనల్ క్రష్ కూడా నడవడం విశేషం.

- Advertisement -

రష్మిక మందన్న తన డాన్స్ తో ఆల్రెడీ కుర్రాళ్లతో డాన్స్ లు చేపిస్తుంది. తాజాగా సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ “జపాన్” సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించబోతున్నారట. కాగా ఈ సినిమాలో కార్తీ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో నటించబోతున్నారు. కమిడీయన్ సునీల్ మరియు విజయ్ మిల్టన్ కీలక పాత్రాలు పోషించ బోతున్నట్టు సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇక నేషనల్ క్రష్ ఐటమ్ సాంగ్ చేస్తుంది అంటేనే అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇప్పటి వరకే కార్తీతో “సుల్తాన్” సినిమాలో జతకట్టిన రష్మిక జత కట్టారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించ్చింది.

“జపాన్” సినిమాపై ఫ్యాన్స్ నుంచి మంచి ఎక్సపెక్టషన్స్ ఉన్నాయి. ఇంక రష్మిక తోడవడంతో అంచనాలు అంతంతకు పెరుగుతూ వస్తున్నాయి. ఇంత హైప్ ఉన్న ఈ సినిమాకి రష్మిక సాంగ్ ఎంత క్రేజ్ ను తీసుకు రానుందో వేచి చూడాల్సిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు