Jawan: షారుక్ ఖాన్ తో మరో బాలీవుడ్ అగ్ర నటుడు.

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం జవాన్. పఠాన్ మూవీ సక్సెస్ తరువాత షారుక్ ఇప్పుడు జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో “జవాన్” అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు షారుక్. ఉత్తరాది, దక్షిణాధి తారల క్రేజీ కాంబినేషన్ లో ముస్తాబ్ అవుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తోండగా.. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. సన్యా మల్హోత్రా మరియు నయనతార హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సునీల్ గ్రోవర్ కూడా ముఖ్యపాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ రెండవ తేదీన 5 భాషల్లో విడుదల కాబోతుంది.

షారుఖాన్ కెరీర్ లోనే ఇది మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నయనతార ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్ర పోషించనుంది. అలాగే ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో భాగం కానున్నారనే ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

- Advertisement -

ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్ర నిడివి తక్కువే అయినా.. అత్యంత కీలకమైందని తెలుస్తోంది. ముందు ఈ పాత్రకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అనుకున్నా.. పుష్ప 2 లో బన్నీ బిజీగా ఉండడంతో కుదరలేదు. దీంతో ఆ పాత్రను చేయడానికి ఇప్పుడు సంజయ్ దత్ ఒప్పుకున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. త్వరలోనే సంజయ్ దత్ తన పాత్రకి సంబంధించిన షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నారట. మరోవైపు విజయ్ హీరోగా నటిస్తున్న ‘లియో’ సినిమాలో కూడా సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సంజయ్ దత్ షారుఖ్ ఖాన్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు