Siva karthikeyan : జెస్సికా కు ముహూర్తం ఫిక్స్

తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్ నటించిన  తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే  సీమ రాజా, రెమో, డాక్టర్, డాన్ వంటి సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ప్రస్తుతం జాతి రత్నాలు ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో తెలుగు,  తమిళ దర్శకుడు  బైలింగ్వల్ సినిమా ప్రిన్స్ చేస్తున్న విషయం విధితమే. కొద్ది రోజుల కిందటే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అదేవిధంగా ఫస్ట్ సాంగ్ ను కూడా విడుదల చేసారు. 

ఇటీవలే ఈ సినిమాను దీపావళికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. విడుదల విషయాన్ని వెరైటీగా అనౌన్స్ చేయడం విశేషం. అప్గనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్జెకిస్తాన్, అంటార్కిటికాలో విడుదల చేయాలనుకున్నా. అప్గనిస్తాన్ లో థియేటర్లు లేవు. కజకిస్తాన్ లో డిస్ట్రిబ్యూటర్లు లేరు. ఉజ్జెకిస్తాన్ లో మార్కెట్ లేదు. అందుకోసమే తెలుగు, తమిళ భాషల్లోనే విడుదల చేస్తున్నామంటూ అనౌన్స్ చేశారు. 

ఈ చిత్రానికి శాంతి టాకీస్ నిర్మాణ భాగస్వామి, నారాయణ్ దాస్ కె.నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చుతున్నారు. తాజాగా థమన్ ఓ ట్వీట్ చేశారు. ప్రిన్స్  చిత్రం నుంచి  జెస్సికా అనే రెండో పాట  సెప్టెంబర్ 23 సాయంత్రం 5.30 గంటలకు విడుదలవుతుందని ట్వీట్ చేశారు. 

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు