Ginna : అంత ప్రచారమేనా ?

ప్రస్తుత కాలంలో కంటెంట్ ఉన్న సినిమాలే థియేటర్స్ లో ఆడుతున్నాయి. ప్రేక్షకులకు ఏ మాత్రం బోరింగ్ అనిపించేలా ఉన్నా.. ఆ సినిమాకు కనీసం కలెక్షన్లు కూడా రావడం లేదు. ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో ప్రిన్స్, సర్దార్, ఓరి దేవుడా కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అలాగే వీటితో విడుదలైన జిన్నా కు కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ ప్రిన్స్, సర్దార్, ఓరి దేవుడా సినిమాలకు వచ్చినంత రెస్పాన్స్ ఈ జిన్నాకు రావడం లేదు.

అయితే బయట మాత్రం ఈ మూడు సినిమాల కంటే జిన్నా నే బాగుంది అన్నట్టు ప్రచారం జరిగింది. తీరా మొదటి రోజు కలెక్షన్లు చూస్తే.. మరి దారుణంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకుని జిన్నా మూవీ వసూళ్లు కేవలం 16 లక్షల రూపాయలే ఉన్నాయి. అమెరికాలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. యూఎస్ లో శుక్రవారం కేవలం 49 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఈ 49 టికెట్లతో 40 వేల రూపాయలు (493 డాలర్లు) మాత్రమే వచ్చాయి.

జిన్నా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే.. 4.60 కోట్ల కలెక్షన్లు రావాలి. అందులో శుక్రవారం 16 లక్షలు రాగా.. ఇంకా 4.44 కోట్ల వసూళ్లు వస్తే బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది. అయితే జిన్నాతో పాటు విడుదలైన ప్రిన్స్, సర్దార్, ఓరి దేవుడా సినిమాలకు పబ్లిక్ టాక్, పాజిటివ్ రివ్యూలతో పాటు థియేటర్ల సంఖ్య కూడా బాగా ఉంది. దీంతో వీటిని ఎదుర్కొని జిన్నా బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమే అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు