Kajal Aggarwal: బాడీ షేమింగ్ కామెంట్స్‌ హింసించాయి.. 

వెండితెర చందమామ అనగానే ఇండస్ట్రీలో గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ముద్ర వేసుకుంది అందాల చందమామ కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నుండి టాలీవుడ్, ఆ తరువాత కోలీవుడ్.. ఈ మూడు భాషల్లో నటిగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ డమ్ ను తెచ్చుకుంది.

ఇలా ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి పీటలెక్కింది ఈ చందమామ. 2020లో తన ప్రియుడు ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని ప్రేమ వివాహం చేసుకుంది. ఇక పెళ్లయిన కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ కావడంతో నటనకు కాస్త బ్రేక్ ఇచ్చింది. అనంతరం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలల తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది కాజల్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” నేను ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు చాలా మంది విమర్శలను నేను విన్నాను. కనీసం కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా లావు అయ్యానంటూ రకరకాలుగా నన్ను చాలామంది విమర్శించారు. అంతేకాదు బాడీ షేమింగ్ కామెంట్స్ అయితే చాలా దారుణంగా పెట్టి హింసించేవారు. అలాగే బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజులకే నటించడానికి సిద్ధం కావడంపై కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడారు. వాటిని నేను పట్టించుకోలేదు” అంటూ ఎమోషనల్ అయింది కాజల్.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు