Kajal: భారీగా తగ్గిపోయిన డిమాండ్… కెరీర్ ముగింపు దశలో చందమామ

టాలీవుడ్ చందమామ ఎవరంటే.. టక్కున అందాల రాశి కాజల్ అగర్వాల్ పేరు చెబుతారు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు తెరకు వచ్చిన కాజల్ కు ‘చందమామ’ మంచి హిట్ ను ఇచ్చింది. దీని తర్వాత కాజల్ కెరీర్ అనూహ్యంగా మారిపోయింది. దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘మగధీర’ సినిమాతో కాజల్ అగర్వాల్ ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లింది. దీని తర్వాత తెలుగులో వరుసపెట్టి స్టార్ హీరోల సరసన నటించింది.

రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పాటు మెగాస్టార్ చిరంజివితో కూడా కాజల్ సినిమాలు చేసింది. టాప్ గేర్ లో దూసుకుపోతున్న కాజల్ కెరీర్ కు పెళ్లి ఒక స్పీడ్ బ్రేకర్ గా మారింది. పెళ్లి ఆ వెంటనే తల్లి కావడంతో, ఇండస్ట్రీకి కొద్ది రోజులు దూరమైంది. ఇది తన కెరీర్ కు మరింత శాపంగా మారిపోయింది. ఇటీవల కాజల్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాల్లో ఛాన్స్ ను కూడా దక్కించుకుంది. రాబోయే సినిమాల్లో కూడా సైన్ చేసింది.

కానీ, కాజల్ హీరోయిన్ గా కెరీర్ ముగిసింది అని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, పెళ్లికి ముందు కాజల్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు చాలా వెయిట్ చేసేవారు. 3 నుంచి 4 కోట్ల రెమ్యునరేషన్ అయినా సరై అంటూ తమ ప్రాజెక్ట్ ల్లో సైన్ చేయించుకునే వారు. కానీ, పెళ్లి తర్వాత పరిస్థితి తలక్రిందులు అయింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు 60 నుంచి 70 లక్షలు కూడా ఇవ్వడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారట. శ్రీలీల, కృతి శెట్టి లాంటి ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీకి వస్తున్న నేపథ్యంలో కాజల్ లాంటి సీనియర్స్ కి చోటు లేకుండా పోయిందని చెప్పొచ్చు. అందుకే తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని పలువరు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి కాజల్ తక్కువ రెమ్యునరేషన్ కి హీరోయిన్ పాత్రలు చేస్తుందా ? లేదా ఇండస్ట్రీకి శాశ్వతంగా దూరమైపోతుందా ? లేక చెల్లి, వదినా, అక్కా, అత్త, అమ్మ లాంటి పాత్రలు చేస్తుందా అనేది చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు