Bimbisara : టెలివిజన్ లోనూ దుమ్ములేపాడు.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలు చేస్తునప్పటకి మంచి హిట్ ను మాత్రం అందుకోలేకపోయారు. కళ్యాణ్ రామ్ స్టోరీ సెలక్షన్ డిఫరెంట్ గా ఉన్నా, అవి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నిలువలేక పోతున్నాయి. అలాంటి సమయంలో మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో బింబిసార సినిమా వచ్చింది. గతేడాది ఆగష్టులో విడుదలైన ఈ సినిమా, కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

పిరియాడికల్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్ ను తెచ్చి పెట్టడమే కాకుండా, కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మంచి కమర్షియల్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ అధికారికంగా ప్రకటించాడు. కళ్యాణ్ రామ్ చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత బింబిసార 2 సెట్స్ పైకి వస్తుందని కూడా ప్రకటించాడు. అలాగే బింబిసార సీక్వెల్ లో భాగంగా వచ్చే మూడో భాగంలో జూనియర్ NTR ఉండబోతున్నట్టు అప్పట్లో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, బింబిసార థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు, ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చినప్పుడు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బింబిసారా సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై టెలికాస్ట్ అయింది. టెలివిజన్ లో కూడా బింబిసార రికార్డులను నమోదు చేసింది.

- Advertisement -

బింబిసార టెలివిజన్ లో అత్యధికంగా 11. 46 రేటింగ్ ను తెచ్చుకుంది. కాగా కళ్యాణ్ రామ్ కు జోడిగా క్యాథరిన్ ట్రెసా నటించారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించగా కీరవాణి సంగీతం అందించారు.

కాగా నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అమిగోస్ అనే కొత్త సినిమా షూటింగ్ లో కళ్యాణ్ రామ్ బిజీ గా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. దీంతో డేవిల్ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత “బింబిసారా ” రెండో భాగం షూటింగ్ మొదలు కానుంది.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు