Kalyan Ram : సక్సెస్ రూట్ పట్టుకున్నాడా ?

ప్రస్తుత కాలంలో సినిమాలపై ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. రొటీన్ కథలకు ప్రేక్షకులు చాలా దూరంగా ఉంటున్నారు. మెచ్చే కథ, కథనం ఉంటేనే థియేటర్ వరకు వచ్చి చూస్తున్నారు. స్టోరీ మెప్పించకపోతే.. ఈ సినిమా మరో మాట లేకుండా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ విషయాన్ని గ్రహించి హీరోలు, దర్శక నిర్మాతలు ఇంట్రెస్టింగ్ స్టోరీలను ఎంచుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ విభిన్నమైన టై ట్రావెల్ నేపథ్యంలో బింబిసార అనే సినిమా చేశాడు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా మరోసారి అమిగోస్ ద్వారా ప్రేక్షకులు మెచ్చే ఇంట్రెస్టింగ్ స్టోరీతో రాబోతున్నాడు. బింబిసార లా.. ఈ సినిమాను కూడా తెరకెక్కించేది కొత్త దర్శకుడే. రాజేంద్ర రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

కాగా ఈ సినిమా విభిన్నమైన కథతో వస్తుందని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. తాజాగా సినిమా నుంచి వరుసగా వస్తున్న అప్డేట్స్.. సినిమా కొత్తగా ఉంటుందని నిరూపిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. దీనిలో కళ్యాణ్ రామ్ ను డోప్లర్ గ్యాంగ్లర్ మొదటి క్యారెక్టర్ అంటూ ఎంటర్ ప్రెన్యూయర్ సిద్ధార్థ్ గా పరిచయం చేశారు.

- Advertisement -

తాజాగా నేడు సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ లో కళ్యాణ్ రామ్ ను డోప్లర్ గ్యాంగ్లర్ రెండో క్యారెక్టర్ అంటూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మంజునాథ్ ను పరిచయం చేశారు. డోప్లర్ గ్యాంగ్లర్ అంటే.. “ఎలాంటి సంబంధం లేకుండా మనిషిని పోలి మరో మనిషి ఉండటం. ఈ నేపథ్యంలోనే సినిమా కూడా ఉండబోతుందని తెలుస్తోంది. అందులో భాగంగా మరో క్యారెక్టర్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇలా క్యారెక్టర్ల తోనే అమిగోస్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచుతున్నాడు కళ్యాణ్ రామ్.

మొత్తంగా ప్రేక్షకుల నాడి పట్టుకున్న కళ్యాణ్ రామ్ ఇలా విభిన్నమైన కథలను ఎంచుకుని తన సినిమాలపై ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాడు. అలా వచ్చిన బింబిసార ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. అమిగోస్ కూడా సూపర్ హిట్ అయ్యేలా ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు