Kalyan Ram:”డెవిల్” మోడ్ లో

స్వర్గీయ నందమూరి హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు నిర్మాతగా, మరోవైపు హీరోగా దూసుకుపోతున్నారు కళ్యాణ్ రామ్. జయపజయాలను లెక్కచేయకుండా విలక్షణ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఆయన వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇకపోతే ఆయన తాజాగా నటించిన చిత్రం “బింబిసార”. వశిష్ట దర్శకత్వంలో ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అదే జోష్ తో తన తదుపరి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

అందులో ఒకటి “డెవిల్”. అభిషేక్ నామ నిర్మాతగా నవీన్ మేడారం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రహస్య గూడచారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

కాగా ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ కసరత్తులు మొదలు పెట్టాడు. తాజాగా కళ్యాణ్ రామ్ జిమ్ లో వర్కౌట్ చేస్తున్న లుక్ బయటకు వచ్చింది. బ్లాక్ టీ షర్ట్ తో జిమ్ లో సీరియస్ లుక్ తో ఉన్న కళ్యాణ్ రామ్ ను చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. డెవిల్ కూడా బంబిసార రేంజ్ లో ఉండాలని కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు