Kamal Haasan : లోకనాయకుడికి అస్వస్థత

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయన సినిమాలు కేవలం సౌత్ లోనే కాదు పాన్ ఇండియా స్థాయిలోనూ ఆడుతాయి. ఈయన నుంచి ఇటీవల వచ్చిన విక్రమ్ సినిమా ఎంత పెద్ధ హిట్ అయిందో అందరికీ తెలుసు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా కమల్ హాసన్ కెరీయర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇది ఇలా ఉండగా ఈ రోజు ఉదయం లోకనాయకుడు కమల్ హాసన్ అభిమానులకు చేదు వార్త వినిపించింది. కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను చెన్నై నగరంలోని పోరూరు రామచంద్ర ఆస్పత్రికి తరలించారు. కమల్ హాసన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. అలాగే ఆయనకు జ్వరం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కమల్ హాసన్ కు చికిత్స అందుతుంది. ప్రస్తుతం లోక నాయకుడు పరిస్థితి ఏంటి. ఆయన ఎందుకు ఆస్పత్రికి వచ్చాడు అని తెలియాలంటే వైద్యలు నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

కాగా కమల్ హాసన్ బుధవారం టాలీవుడ్ సీనియర్ నటుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ ను హైదరాబాద్ లో కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా కమల్ హాసన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కాగా కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత KH233 ని వినోద్ డైరెక్షన్ లో చేయాల్సి ఉంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు