Kamal Hassan : కాంతారా పై తన అభిప్రాయాన్ని చెప్పిన కమల్

కనడ ఇండస్ట్రీ నుంచివచ్చిన సినిమా ‘కాంతారా’ మనదేశంలో ప్రభంజనం సృష్టించని భాష లేదేమో. రిలీజ్ అయిన ప్రతిభాషలోనూ బ్లాక్ బస్టర్ అందుకొని విపరీతమైన కలెక్షన్స్ ని తెచ్చుకునింది. కొంతమంది ఈ సినిమాలో ఏముంది అనగా మరి కొంతమంది మాత్రం ఈ చిత్రం ఎంత బాగుంది అని అన్నారు. అయితే ఎవరు ఏమన్నా ఈ సినిమా క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రాణం పోసింది అని అనడంలో సందేహం లేదు. రిషబ్ శెట్టి హీరోగా మరియు దర్శకుడిగా చేసిన ఈ చిత్రం కనడ సినిమా రేంజ్ ని మరో స్థాయికి తీసుకెళ్ళింది.

యాష్ నటించిన KGF సినిమాతో కన్నడా చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా పరంగా పేరు తెచ్చుకోగా కాంతారా సినిమాతో ఆ పేరు కాస్త రెట్టింపు అయింది. 1970’s ల్లో కన్నడ పరిశ్రమ నుంచి చాలా గొప్ప సినిమాలు వచ్చాయి. అయితే కొన్నాళ్లు పరిశ్రమ రీమేక్ సినిమాలే చేయగా మళ్లీ ఇప్పుడు కన్నడ పరిశ్రమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా కేవలం 17 కోట్లతో కాంతారావు సినిమా తీయగా అది ఏకంగా 400 కోట్లు సంపాదించి అందరి దగ్గర వారేవా అనిపించుకుంది. ఇలాంటి వండర్స్ క్రియేట్ చేసిన కాంతారావు సినిమా గురించి ఇప్పటికే ఆ సినిమా పై ప్రశంసలు అందించారు. ఈ లిస్ట్ లో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా చేరారు.

ఏదైనా ఒక సినిమా నచ్చిన నచ్చకపోయినా తనదైన స్టైల్ లో కామెంట్ చేసేస్తారు మన హీరో కమల్ హాసన్. ఇక కాంతారా సినిమా గురించి చెబుతూ కమల్ హాసన్ కన్నడ పరిశ్రమ నుంచి ఇలాంటి కొత్త సినిమాలు రావడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంతార ఉద్దేశించి కమల్ కన్నడ పరిశ్రమకు మళ్లీ పాత రోజులు వచ్చాయని ఒకప్పుడు ఆ పరిశ్రమ నుంచి వంశవృక్ష కాడు వంటి సినిమాలు వచ్చాయి.. మళ్లీ ఆ తరహా సినిమాలు రావడం సంతోషమని అన్నారు. కమల్ కామెంట్స్ కి కాంతర హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి అలా ఆనంద పడిపోయాడు. కమల్ హాసన్ కి తన కృతజ్ఞతలు తెలిపాడు రిషబ్ శెట్టి.

- Advertisement -

మరోపక్క రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ పైన కూడా వర్క్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ స్క్రిప్ట్ ఇంకా రెడీ కాకపోవడంతో పూర్తిగా రెడీ చేసుకుని మరి కొద్ది రోజుల్లో ఈ హీరో మన ముందుకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక దానికోసం ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు