Ahimsa : కమ్మగుంటదే

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న కొత్త హీరో అభిరామ్. రానా తమ్ముడు అయినా అభిరామ్ ఇప్పటికే వెండితెర ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు తేజ దర్శకత్వంలో అభిరామ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కి ముహూర్తం ఖరారు అయింది. క్రియేటివ్ డైరెక్టర్ తేజ, అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో అభిరామ్ కు జోడిగా గీతిక తివారి హీరోయిన్ గా నటించింది. ఆనంది గీత ఆర్ట్స్ క్రియేషన్స్ పథకంపై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించాడు.

తాజాగా ఈ సినిమా నుంచి కమ్మగుంటదే అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ ఒకరి పట్ల ఒకరు తమ ప్రేమని వెల్లడి చేసే ప్రయత్నం గా ఈ పాట వస్తుంది. ఆర్పి పట్నాయక్ అందించిన బాని కొత్తగా అనిపిస్తుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని కాలభైరవ-కీర్తన శ్రీనివాస అలపించారు. ఓ గ్రామీణ ప్రాంత నేపథ్యంలోని లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ పాటలో హీరో మరియు హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. వారి మధ్య సాగిన రొమాన్స్.. ఆధ్యాంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక అటు ఈ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. 

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు