SitaRamam : అద్భుతమైన సినిమా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు కంగనా రనౌత్. ఈమె సోషల్ మీడియాలో చేసే పోస్టులు, చేసే సినిమాలు అన్ని కూడా వివాదాస్పదమవుతుంటాయి. నిజానికి ఈమె వివాదాస్పదమయ్యే స్టోరీలతోనే సినిమాలు చేస్తుంటుంది. ఇటీవల కంగనా ధాకడ్ అనే సినిమా చేసింది. రూ. 85 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం కనీసం రూ. 5 కోట్ల కలెక్షన్లను కూడా చేయలేకపోయింది. ప్రస్తుతం ఈ ఫైర్ బ్రాండ్ ఎమర్జెన్సీ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఈమె ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తుంది.

తాజాగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ అయిన సీతారామం సినిమాపై కంగనా రనౌత్ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. సీతారామం చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాను ఓటీటీలో సీతారామం చూశానని కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉందంటూ పొగడ్తలతో ముంచేత్తింది.

సీతారామంకు దర్శకత్వం, స్క్రిన్ ప్లే అన్ని చక్కగా కుదిరాయని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అలాగే సీతామహాలక్ష్మీ, ప్రిన్సెస్ నూర్ జహాన్ పాత్రల్లో బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించిందని తెలిపింది. కాగా ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించిగా, వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు