Rishab Shetty : జూన్ నుంచి సెట్స్ పైకి ‘కాంతార 2’

గతేడాది చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం కాంతారా. రిశాబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కన్నడంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలోని క్లైమాక్స్ కు ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే.

అయితే, కాంతార సినిమా రిలీజ్ అయ్యి వంద రోజులు అయింది. ఇండియా నుంచి ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అయిన సినిమాల్లో కాంతారకి చోటు దక్కింది. దీంతో కాంతారా సినిమాపై అందరి దృష్టిపడింది. ఒక రీజనల్ సినిమాగా ప్రయాణం మొదలుపెట్టిన కాంతార సినిమాకి ఈరోజు ఇంటర్నేషనల్ రీచ్ కావడంతో చిత్ర యూనిట్ క్లౌడ్ నైన్ లో ఉన్నారు. గతంలో కాంతార సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే, త్వరలో చెప్తాను అని సమాధానం ఇచ్చిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతారా 2 స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు.

కోస్టల్ కర్ణాటకలో కాంతారా 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని శాండల్ వుడ్ వర్గాల సమాచారం. అయితే కాంతారా 2 సీక్వెల్ గా కాకుండా ఫ్రీక్వెల్ గా రూపొందనుందట. అంటే ఫస్ట్ పార్ట్ లో మనం చూసిన ఫస్ట్ 20 మినిట్స్ కి ముందు జరిగిన కథ (శివ తండ్రి కథ) తో కాంతారా 2 తెరకెక్కనుందని సమాచారం. కాగా, రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. కేజీఎఫ్ లాంటి అద్భుత సినిమాను రూపొందించిన హోం భలే ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు