Kantara: చిక్కుల్లో చిత్రం

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చిత్రం “కాంతారా”. తెలుగు రాష్ట్రాలలోనూ ఈ సినిమా ఓ రేంజ్ లో వసూళ్లను రాబడుతుంది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ఆ తర్వాత అన్ని భాషలలోనూ సూపర్ హిట్ గా నిలిచింది. కేజిఎఫ్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో హిట్ అందుకుంది “కాంతార”. కర్ణాటకలోని తులూనాడులో ఉన్న సంస్కృతులను చక్కగా చూపించారు. అయితే ఈ చిత్రం ఇప్పుడు చిక్కుల్లో పడింది. ” వరాహ రూపం” అనే పాటను తమ నుంచి కాపీ కొట్టారని తాయిక్కుడమ్ బ్రిడ్జ్ అనే మ్యూజిక్ ట్రూప్ ఆరోపణలు చేసింది.

అనుమతులు తీసుకోకుండా వారి పాటను తీసుకోవడం పట్ల వారు కోర్టుకెక్కారు. దీనిపై విచారణ జరిపిన కోజికోడ్ న్యాయస్థానం సినిమాలో వరాహ రూపం పాటను తాయిక్కుడమ్ బ్రిడ్జ్ అనుమతి లేకుండా ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. కాంతార మేకర్స్ కి వరాహ రూపం అనే పాటను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని తాయిక్కుడమ్ బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కన్నడలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో కాంతార సినిమా తెరకెక్కింది. అయితే కోర్టు ఆదేశాలను పాటించి ఈ పాటని సినిమాలోంచి తీసేస్తారా.. లేక సెటిల్ చేసుకుంటారా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు