Kareena Kapoor: బాయ్ కాట్ ట్రెండ్ పరిశ్రమకు మంచిది కాదు

బాలీవుడ్ లో ఇటీవల చాలా సినిమాలు బాయ్ కాట్ ను ఎదుర్కొంటున్నాయి. బాలీవుడ్ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా సోషల్ మీడియాలో బాయ్ కాట్ నినాదం వినిపిస్తోంది. బాయ్ కాట్ ప్రభావం ఇప్పటి వరకు చాలా సినిమాలపై పడింది. స్టార్ హీరో, చిన్న హీరో అనే తేడా లేకుండా చాలా మంది హీరోలకు ఈ బాయ్ కాట్ సెగ తగిలింది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా నుంచి ఈ బాయ్ కాట్ ట్రెండ్ ఎక్కువగా వినిపిస్తోంది.

బాయ్ కాట్ దెబ్బకు లాల్ సింగ్ చడ్డా దారుణమైన డిజాస్టార్ గా మిగిలిపోయింది. అప్పటి నుంచి చాలా సినిమాలు ఈ నినాదానికి డిజాస్టార్ గా, ఫ్లాప్ గా మారిపోయాయి. ఇటీవల రణవీర్ సింగ్ నుంచి వచ్చిన సర్కాస్ చిత్రం కూడా బాయ్ కాట్ ట్రెండ్ కు బలైపోయింది. తాజాగా బాయ్ కాట్ నినాదం షారుక్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న పఠాన్ పై పడింది. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన బేషరమ్ సాంగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఈ సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రెటీలు స్పందించారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా స్పందించారు. “బాయ్ కాట్ నినాదం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. ఈ నినాదంతో నేను ఏకీభవించను. బాయ్ కాట్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, ప్రేక్షకులను మేము ఎలా ఎంటర్టైన్ చేయగలం. బాలీవుడ్ లో సినిమాలు రాకపోతే వినోదం ఎక్కడి నుంచి వస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు