Karthi : దీపావ‌ళి బ‌రిలో..

త‌మిళ స్టార్ హీరోల్లో కార్తీ ఒక‌రు. ఇటీవ‌లే మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలో కార్తీ కీల‌క పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ ల‌భిస్తోంది. మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు హీరో కార్తి.

అభిమ‌న్యుడు ఫేమ్ ద‌ర్శ‌కుడు పిఎస్ మిత్ర‌న్ కాంబోలో వ‌స్తోన్న సినిమా స‌ర్దార్‌. ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ల‌క్ష్మ‌ణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది. కింగ్ అక్కినేని నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్ ‘స‌ర్దార్’ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తోంది. ఇక ఈ చిత్రంలో రాశిఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ర‌జిషా విజ‌య‌న్‌, చుంకీ పాండే కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈనెల 21న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

తెలుగులో అక్కినేని నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేయ‌నుంది. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. మ‌రోవైపు ఈ చిత్రంలో కార్తీ ఆరు విభిన్న పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. ముఖ్యంగా వైవిద్య‌మైన క‌థ ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచింది. ముఖ్యంగా మీరు వెతుకుతున్న స్పై పేరు ఏంటి..? ఇతనికి ఎనిమిది దేశాల పాస్‌పోర్ట్స్ ఉన్నాయి, ఆరు వంద‌ల సార్లు ఇంట్రాగేట్ చేశాం, ప్ర‌తీసారి ఒక్కో లాంగ్వేజ్‌.. ఒక్కో క‌థ‌.. ఇవ‌న్నీ వాస్త‌వ‌మేన‌ని మిష‌న్ చెబుతోంది. ఆ ఆరుమంది ఒక్క‌రే.. అనే డైలాగ్‌లు టీజ‌ర్‌లో ఉన్నాయి. దీపావ‌ళికి గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న స‌ర్దార్ ఫ‌లితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు