Karthikeya 2 : మరో అడుగు.. 

టాలీవుడ్ పరిస్తితులను మార్చిన సినిమాల్లో కార్తికేయ-2 ముందు వరుసలో ఉంటుంది. రెండు నెలల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు హిట్స్ లేని సమయంలో సీతా రామం, బింబిసార ఊపిరిపోశాయి. వీటి తర్వాత వచ్చిన కార్తికేయ-2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా, బాలీవుడ్ లో కూడా తిరుగులేని రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా హిందీ రాష్ట్రాల్లో బాలీవుడ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్లింది. 

కార్తికేయ-2 ఇప్పటికే 120 కోట్ల కలెక్షన్లను అందుకుని ఫుల్ జోష్ లో ఉంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 05న ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని సమాచారం. జీ5 స్ట్రీమింగ్ అవుతుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా మలయాళ అభిమానులకు కార్తికేయ-2 టీం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 23న మలయాళ భాషలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

ఈ రోజు మూవీ టీం కొచ్చిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ స్వస్థలం కొచ్చిన్ అని అందరికీ తెలుసు. తనతో పాటు చాలా మంది కార్తికేయ-2 మలయాళ వర్సన్ కోసం ఎదురుచూస్తున్నారని అనేక సందర్భాల్లో అనుపమ చెప్పింది. ఫైనల్ గా ఈ నెల 23 నుంచి కార్తికేయ-2 మలయాళ వర్షన్ అందుబాటులోకి రానుంది. 

- Advertisement -

ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కార్తికేయ-2.. మలయాళంలో కూడా సూపర్ హిట్ అవడం ఖయమే. అలాగే ఈ సినిమాకు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కూడా పుష్కలంగా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు