Bedurulanka 2012 : స్టైలీష్ గా ఫస్ట్ లుక్

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘బెదురులంక 2012’. ఇందులో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయిక. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫొటో’ నిర్మించిన బెన్నీ ముప్పనేని నిర్మిస్తున్న తాజా చిత్రమిది.

నేచురల్ స్టార్ నాని ఈ రోజు ‘బెదురులంక 2012’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో కార్తికేయ స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నాడు. కోపంతో చూస్తూ.. చేతిలో రెండు ఉంగరాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో ఈ ఉంగరాలతో ఎదైనా ఉంటుందా అని తెలియాల్సి ఉంది. కాగా బెదురులంక 2012 ను విభిన్నంగా తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ఈ సినిమాను చేసినట్టు నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని అన్నారు.

శరవేగంగా జరుపుకుంటున్న షూటింగ్ చివరి దశలో ఉంది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఈ సినిమా కోసం మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన బాణీలు అందించారని టీం తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమాలో ఒక పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారట. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ గా ఉంటాయని, అవి ప్రేక్షకులను మెప్పిస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు