Karuna Bhushan : లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నా..

ఆహా సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై అటు బుల్లితెర పేక్షకులను, ఇటు వెండితెర ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీరియల్ నటి కరుణ భూషణ్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీరియల్స్, సినిమాల్లో తనదైన నటనతో మంచి గుర్తింపును సాధించుకుంది. మొగలిరేకులు, శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్ లో నటించింది. అలాగే కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కష్టం, మాస్ వంటి చిత్రాలలో నటించింది.

ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు అయింది. అయితే తాజాగా యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కరుణ భూషణ్ తన ప్రేమా మరియు పెళ్లి తదితర విషయాల గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది. భరత్ భూషణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది కరుణ. ఆ తర్వాత కూడా నటనను కొనసాగించింది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు.

అయితే 2007లో భరత్ నీ లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నానని తెలిపింది కరుణ భూషణ్. తన భర్త యాడ్ డైరెక్టర్ గా పనిచేసేవాడని తెలిపింది. ఇంట్లో వాళ్ళ ప్రేమకి ఒప్పుకోకపోవడంతో పారిపోయి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. ఆమె ఇప్పటివరకు 30 కి పైగా సినిమాలలో నటించిన కు వెల్లడించింది. తను ఎంతగానో నమ్మినా కొందరు తనని మోసం చేసినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కరుణ, భూషణ్ పలు ఈవెంట్లు, సీరియల్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు