Katrina Kaif : డిమాండ్ తగ్గలేదు.. పెరుగుతోంది

బాలీవుడ్ బిజీ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ 15 సంవత్సరాలకు మించి టాప్ హీరోయిన్ గా కొనసాగడం అంటే అది చిన్న విషయం కాదు. ఇక అందులోనూ హీరోల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఇండియాలో చాలా అరుదు. వారానికి ఒక కొత్త హీరోయిన్ పరిచయం అవుతున్న నేపథ్యంలో కత్రినా కైఫ్ మాత్రం తన డిమాండ్ ను ఏమాత్రం తగ్గించుకోకుండా చక్కగా మెయింటైన్ చేస్తూ వస్తుంది.

బాలీవుడ్ లో బూమ్ అనే చిత్రంతో తెరంగేట్రం చేసిన కత్రినా కైఫ్.. తెలుగులో కెరీర్ ప్రారంభంలో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి చిత్రాలలో నటించి ఊహించని స్థాయిలో క్రేజ్ ని తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ అత్యధికంగా ఫాలోవర్స్ కలిగి ఉన్నటువంటి హీరోయిన్లలో కత్రినా కైఫ్ కూడా ఒకరు. నటుడు విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్నప్పటికీ ఈమె వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది.

అయితే తాజాగా కత్రినా కైఫ్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఈమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఒక్క పోస్ట్ చేస్తే సుమారు 97 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక అదే విధంగా ఒక్కో సినిమాకు ఐశ్వర్యారాయ్ రూ.10 కోట్ల వరకు తీసుకుంటే.. కత్రినా కైఫ్ సుమారు రూ. 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్. ఈ వార్త తెలియగానే ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు