Keerthy Suresh : ఊర మాస్ లుక్ తో

మహానటి సినిమాతో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఇక ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ పురస్కారం అవార్డు వరించింది. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా దసరా. ఈ చిత్రం సింగరేణి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయినట్టు సమాచారం.  ఇక మార్చి 30, 2023న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే అప్టేట్ వదిలింది చిత్ర యూనిట్. 

ఇవాళ కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా వెన్నెల అనే పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోందని ‘దసరా’ టీమ్  ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ  ఓ పోస్టర్ విడుదల చేశారు. ఎల్లో సారి కట్టుకుని ఊర మాస్ అవతారంలో డ్యాన్స్ వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 30వ పుట్టిన రోజు సందర్భంగా కీర్తి సురేష్ ఫ్యాన్స్ తో పాటు సెలెబ్రిటిస్ బర్త్ డే విషేష్ తెలుపుతున్నారు. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు