Keerthy Suresh : మరో లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో..

సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లిస్ట్ తీస్తే అందులో కీర్తి సురేష్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. సీనియర్ హీరోయిన్ మేనక కూతురిగా చిన్నప్పటి నుంచే వెండితెరపై కనిపించిన కీర్తి సురేష్, మొదటిసారి ప్రధాన పాత్రలో గీతాంజలి సినిమా చేసింది. నేను శైలజతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై భామ.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాతో వరుసగా అవకాశాలు కొట్టేసింది. అంతే కాదు.. లెజండరీ నటి మహానటి సావిత్రి బయోపిక్ లో ఛాన్స్ దక్కించుకుంది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సౌత్ లో దాదాపు అన్ని భాషల ప్రేక్షకులకు కీర్తి కనెక్ట్ అయింది. దీని తర్వాత చాలా సినిమాలు చేసింది. కానీ, మహానటి అంతటి విజయాన్ని మాత్రం మళ్లీ దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలో కీర్తి సురేష్ తన రూట్ ను మార్చేసి.. లేడీ ఓరియెంటెడ్ స్టోరీలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఈ జానర్ లో ఇప్పటికే మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, చిన్ని వంటి సినిమాలు చేసింది.

తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాను కీర్తి సురేష్ అనౌన్స్ చేసింది. రివాల్వర్ రీటా అనే టైటిల్ ను ప్రకటించారు. దీంతో పాటు ఓ పోస్టర్ ను సైతం విడుదల చేశారు. పెయింటింగ్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ రెండు చేతుల్లో రివాల్వర్ ను పట్టుకుని ఉంది. ఈ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కబోతుంది. దీనికి చంద్రు దర్శకత్వం వహిస్తుండగా, `ది రూట్, ప్యాషన్ స్టూడీయోస్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

- Advertisement -

కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో రివాల్వర్ రీటాతో సహా మొత్తం 6 సినిమాలు ఉన్నాయి. అందులో దసరా, భోళా శంకర్ తెలుగు సినిమాలు కాగా.. మరో నాలుగు సినిమాలు తమిళంలో తెరకెక్కుతున్నాయి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు