KGF : 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నKGF

ఒక్కప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి సినిమా వచ్చినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ వాటన్నింటినీ ఒక రాత్రిలో చేంజ్ చేసేసింది KGF. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన KGF వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. KGF సినిమా తర్వాత వీరి క్రేజ్ ప్రపంచ స్థాయి కి చేరుకుంది. పాన్ ఇండియా హీరోగా యష్, పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ పేరందుకున్నారు.

హీరో యష్ కు జోడిగా 2016లో మిస్ సూపర్ నేషనల్ గా నిలిచినా శ్రీనిధి శెట్టి హీరయిన్ గా నటించారు. తమన్నా చేసిన ఐటం సాంగ్ కి ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు. రామచంద్రరాజు, వశిష్ట ఎన్. సింహ, అర్చన జోయిస్, అనంత్ నాగ్, అచ్యుత్ కుమార్, మాళవిక అవినాష్ ముఖ్య పాత్రలో కనిపించారు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రొడ్యూస్ మంచి విజయాలు అందుకుంటున్న హంబోలె ఫిలిమ్స్ KGFను ప్రొడ్యూస్ చేసారు.

2018లో డిసెంబర్ 21న రిలీజ్ అయిన KGF.. ఇవాల్టికి రిలీజ్ అయి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికి KGF అంటేనే పిచ్చి ఎక్కిపోయేవాళ్ళు ఉన్నారు. బాహుబలి తర్వాత ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లిన సినిమా KGF. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. సినిమాలోని మదర్ సెంటిమెంట్ అందరిని కదిలించింది. హిందీలో కోటి తో మొదలైన కలెక్షన్స్ 50 కోట్లతో ముగిసాయి. 2022లో రిలీజ్ అయిన KGF చాప్టర్ 2 సంచలన విజయం సాధించింది. కన్నడ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు