Khusi: కలక్షన్స్ తగ్గడం ఖాయం

నింగి, నేల, నీరు, నిప్పు, గాలి పంచభూతాల్లా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా శాశ్వతం. తన స్టైల్ తో యూత్ ను ఉర్రుతలూగించడం కేవలం కళ్యాణ్ కి మాత్రమే చెల్లింది. తన కెరియర్ లో ఖుషి వరకు వరుస హిట్ సినిమాలను చేసి తనకంటూ ఒక సెపెరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఖుషి. రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ తరుణంలో ఖుషి రీ రిలీజ్ అవడం పవన్ ఫ్యాన్స్ కు పండుగను తెచ్చి పెడుతుంది. సూపర్ హిట్ సినిమా రీరిలీజ్ కాబట్టి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అవి అయిపోవడం కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు.

ఇది ఇలా ఉండగారీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు ధమాకా మరియు 18 పేజెస్. భారీ అంచనాలతో వచ్చి ఫ్యాన్స్ ఎక్సపెక్టషన్స్ ను రీచ్ అయి మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు విడుదల అయినప్పటి నుంచి రోజు రోజుకి కలెక్షన్స్ భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.

ఈ తరుణంలో డిసెంబర్ 31న ఖుషి థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పుడిప్పుడే ధమాకాతో పాటు 18 పేజెస్ కలెక్షన్స్ పుంజుకుంటున్న టైంలో ఖుషి రీరిలీజ్ ఎఫెక్ట్ వీటి పై పడనుంది అని అర్ధమవుతుంది. ఇదివరకే రిలీజైన పవన్ తమ్ముడు, జల్సా సినిమాలకు కూడా అభిమానులు బ్రహ్మరధం పట్టారు.ఇప్పుడు ఖుషి సినిమాకు కూడా అదే స్థాయి రెస్పాన్స్ వస్తే ప్రస్తుత సినిమాలకు కలక్షన్స్ తగ్గడం ఖాయం అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు