Thalapathy67 : లోకేష్ ప్లాన్ అదిరింది

టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ” విక్రమ్” సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. తలపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని సమాచారం అందుతుంది.

ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ కనిపిస్తాడని, అతనికి అసిస్టెంట్ పాత్రలో ఓ హీరోయిన్ నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. అలాగే మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. తలపతి విజయ్ సినిమా కావడం.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం కాబట్టి ఈ చిత్రం ప్రకటన వచ్చి నాటి నుంచి భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. కాగా విజయ్ తలపతి, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఇప్పటికే మాస్టర్ అనే చిత్రం విచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు వీరి కాంబోలో రెండో సినిమా తలపతి67. కాగా దీనిపై రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తిరమైన వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విజయ్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా నటిస్తున్నాడట. విశాల్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని సమాచారం. అయితే విశాల్ అతిథిగా వస్తున్నాడా.. లేదా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మరో ప్రయోగం చేయబోతున్నారా అనేది మాత్రం క్లారిటీ లేదు. అలాగే విశాల్ పాత్ర గురించి చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు