BRO : పవన్ కళ్యాణ్ పై టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంచలన వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ గురించి నిత్యం ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉండటం సర్వ సాధారణమే. కొన్ని పొలిటికల్ విమర్శలైతే మరికొన్ని సినిమా, వ్యక్తిగత పరమైనవి ఉంటాయి. అయితే ఈసారి బిన్నంగా పవన్ రెమ్యునరేషన్ గురించి ఒక టాలీవుడ్ సీనియర్ యాక్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీకి సంబందించిన కార్యక్రమాలలో రెగ్యులర్ పాల్గొంటూనే, వరుస సినిమాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బ్రో మూవీ షూటింగ్ కంప్లిట్ చెయ్యగా, మరో మూడు సినిమాల షూటింగ్స్ కి సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలకి భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారనే రోజు వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్ని సినిమాలకు లాభాల్లో షేర్ తీసుకుంటున్న పవన్, మరికొన్ని సినిమాలకి భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

అయితే ఈ రెమ్యునరేషన్ ఎంత అనేది అందరు గాల్లో లెక్కలు వేసుకోవడమే తప్ప. నిజానికి పవన్ ఎంత తీసుకుంటున్నాడో ఎవరికీ తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ బహిర్గతం చేసాడు. బ్రో సినిమాకి గాను పవన్ అక్షరాలా రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్న అని సభా ముఖంగా చెప్పాడు. అయితే ఇలా అందరి ముందు రెమ్యునరేషన్ రివీల్ చేయడంతో ఇండస్ట్రీలో అంత ఈ విషయంపై గుసగుసలాడారు. కానీ పైకి మాత్రం ఎవరు ఏమి మాట్లాడుకున్న సైలెంట్ గా ఉన్నారు.

- Advertisement -

ఇటీవలనే జరిగిన ఒక ఇంటర్యూ లో పాల్గొన్న సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాస రావు మాత్రం పవన్ కళ్యాణ్ ఇలా బహిరంగంగా రెమ్యునరేషన్ చెప్పడాన్ని ఖండించాడు. ” సీనియర్ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి వాళ్ళు చాలా సినిమాలు చేసారు కానీ ఎప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్ గురించి బహిరంగంగా మాట్లాడలేదు. కానీ ఇవాళ కొంతమంది హీరోలు బహిరంగంగా ఇంత తీసుకుంటున్న అని చెబుతున్నారు ఇలా చెప్పడం పద్ధతి కాదు” అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇలా చెప్పడం వల్ల వేరే టాప్ హీరోలు, ప్రొడ్యూసర్స్ మధ్యలో విభేదాలు తలెత్తుతాయి అని ఆయన అభిప్రాయ పడ్డారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు