Krish 4: క్రిష్ 4 కోసం హాలీవుడ్ కి హృతిక్ రోషన్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అంటే తెలియని వారు ఉండరు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేష్ రోషన్ కుమారుడిగా ఇండస్ట్రీకి వచ్చిన హృతిక్ రోషన్ ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే హృతిక్ రోషన్ అన్ని సినిమాల్లో ఎక్కువ మందికి నచ్చేది క్రిష్ ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి.

హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ క్రియేట్ చేసిన ఈ ఫ్రాంచైజ్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఫ్రాంచైజ్ లో వచ్చిన ఫస్ట్ మూవీ కోయి మిల్ గయా. 2003 లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. దీని తర్వాత 2006లో క్రిష్ సినిమా వచ్చింది. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన క్రిష్ చిత్రం 130 కోట్ల వసూళ్లు అనేక రికార్డులను క్రియేట్ చేసింది. దీని తర్వాత 2013లో క్రిష్ 3 వచ్చింది. ఇది 100 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కగా.. 400 కోట్ల వసూళ్లు చేసింది.

అయితే ప్రస్తుతం క్రిష్ 4 ను తెరకెక్కించడానికి సన్నహాకాలు చేస్తున్నారు. క్రిష్ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలకు రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. కానీ, క్రిష్ 4 కి రాకేష్ రోషన్ కాకుండా ఇతరులతో దర్శకత్వం చేయించాలని నిర్ణయం తీసుకున్నారట. అందు కోసం హాలీవుడ్ దర్శకులను సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. హృతిక్ టీం ఇప్పటికే కొంత మంది హాలీవుడ్ దర్శకుల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అందులో ఒకరి పేరును ఫిక్స్ చేసి, త్వరగా షూట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -

కాగా క్రిష్ 4 చిత్రం హృతిక్ కలల ప్రాజెక్ట్ అని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ను ప్రాతిష్టాత్మకంగా, హాలీవుడ్ స్థాయిలో రూపొందిచాలని హృతిక్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హాలీవుడ్ డైరెక్టర్స్ ను తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు