Bhavadeeyudu Bhagat Singh : క్రిష్ క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు విన్న, ఈ విజువల్ చూసిన బాడీ లో కరెంట్ పాస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు రోడ్లు ట్రాఫిక్ జాములు అవుతాయి. థియేటర్లు బ్యానర్ లు తో నిండిపోతాయి. ఏ హీరోకి అయినా ప్లాప్ పడితే పాతాళానికి పోతాడు. కానీ పవన్ కళ్యాణ్ కి ఐదేళ్లు హిట్ పడకపోయినా శిఖరానికి ఎదిగాడు.

జానీ సినిమా తర్వాత ఐదేళ్లు హిట్ లేదు
అయినా ఇమేజ్ చెక్కు చెదరలేదు,
రెండేళ్లకు ఒక సినిమా,అయినా ఓపెనింగ్స్ కు డోకా లేదు,
ఆయన సినిమా వస్తే చాలు
దానికి హిట్టు ప్లాప్ తో సంబంధం లేదు.
అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే.

గుడుంబా శంకర్ , బాలు ,బంగారం, అన్నవరం సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు, వరుస ఫెయిల్యూర్ సినిమాలు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా మంచి హిట్ అయింది. కానీ అభిమానుల ఆకలి తీరలేదు.

- Advertisement -

పులి, తీన్ మార్, పంజా మళ్ళీ రొటీన్ ప్లాప్ లు. అప్పుడొచ్చాడు ఒకడు ఒక రీమేక్ సినిమాతో రికార్డ్స్ కొట్టొచ్చు అని ప్రూవ్ చేసాడు. తన అభిమాన హీరోను తాను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాడు. ఆకలితో సినిమాకి వచ్చిన ప్రేక్షకుడిని భుక్తాయాసంతో థియేటర్ బయటకు పంపించాడు. పవన్ కళ్యాణ్ కి జీవితాంతం ఋణపడి ఉంటాను అని చెప్పిన హరీష్ శంకర్. పవన్ అభిమానులు హరీష్ ఋణం తీర్చలేనంత హిట్ సినిమాను ఇచ్చాడు.

మళ్ళీ ఆ కాంబినేషన్ లో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేసారు. ఎట్టకేలకు భవదీయుడు భగత్ సింగ్ సినిమాతో ఆ కాంబినేషన్ సెట్ అయింది. కాంబినేషన్ అయితే సెట్ అయింది కానీ సినిమా ముందుకు వెళ్లట్లేదు అని కళ్యాణ్ అభిమానులకు కొద్దిపాటి బాధ. రీసెంట్ టైమ్స్ లో సినిమా ఆగిపోయింది అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ వీటన్నింటికి ఒక ట్వీట్ తో చెక్ పెట్టాడు దర్శకుడు క్రిష్.

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ షూటింగ్ కి వెళ్ళాడు. అక్కడ దర్శకుడు క్రిష్ ఫోటోను తీసి ట్విట్టర్ లో అప్లోడ్ చేసి పవన్ కళ్యాణ్ ను యాక్షన్ సీన్స్ లో చూడటం సంతోషం అనిపించిందంటూ ట్వీట్ చేసాడు. దీనికి క్రిష్ స్పందిస్తూ ఫోటో తీసినందుకు థాంక్స్ బ్రదర్. త్వరలో భవదీయుడు భగత్ సింగ్ సెట్ కి నేను వస్తాను అని చెప్పాడు క్రిష్.

ఈ రిప్లై ఇప్పుడు పవన్ అభిమానులకు కొంత ఊరటనిస్తుంది. ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలకు ఈ రిప్లై తో తెరపడింది. వాస్తవానికి పవన్ చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్న భవదీయుడు భగత్ సింగ్ చాలా స్పెషల్ ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు