Krishna Vrinda Vihari : ప్రీ రిలీజ్ ఈవెంట్

యంగ్ హీరో నాగ శౌర్య నుండి తాజాగా వస్తున్న చిత్రం కృష్ణ వ్రింద విహారి . రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి ఆర్. కృష్ణ దర్శకత్వం వహించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మెల్పూరి నిర్మించారు. నాగ శౌర్య కు జోడీగా, ఈ చిత్రంలో కథనాయకిగా షర్లీ సెటియా నటించారు. అలాగే మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి అయింది. కానీ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది.

ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 22న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ అప్పుడు వాయిదా పడింది. దీని తర్వాత మే 20కి దాని తర్వాత జూన్ 24 కు వాయిదా వేశారు. అప్పుడు కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. చివరగా ఈ నెల 23న విడుదల చేయాలని మూవీ యూనిట్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రమోషన్ పనులను కూడా ప్రారంభించారు.

రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వేన్షన్ లో ఈ ప్రీ రిలీజ్ వేడుక జరగనుందని వెల్లడించారు. అయితే ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారో.. అనే దానిపై మాత్రం మూవీ యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు