Krishnamma Teaser : ఈ సారి యాక్షన్

కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చేస్తూ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సత్యదేవ్. ముందుగా హీరోగా గుర్తింపు వచ్చింది మాత్రం పూరి జగన్నాథ్ తెరకెక్కించిన “జ్యోతిలక్ష్మి” అనే చెప్పాలి. తాజాగా “గాడ్సే” సినిమాతో జనం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సత్యదేవ్ వైవిధ్యం కోసం తపిస్తూ ఉంటాడని ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. “ఆచార్య” లో కాసేపు కనిపించిన సత్యదేవ్, “గాడ్ ఫాదర్” లోనూ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ఇదిలా ఉండగా సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “కృష్ణమ్మ”. డైరెక్టర్ వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా హీరో సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా కృష్ణమ్మ టీజర్ ను విడుదల చేసారు.

ఈ టీజర్ 1 నిమిషం 19 సెకండ్లు ఉండగా.. సత్యదేవ్ వాయిస్ ఓవర్ తో కథను వివరిస్తున్నారు. “ఈ కృష్ణమ్మ లాగే మేము ఎప్పుడు పుట్టామో, ఎక్కడ పుట్టామో ఎవరికి తెలియదు. పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక కథ ఉండే ఉంటుంది.. నది నడక ప్రశాంతంగా సాగిపోవాలంటే ఎవ్వడు గెలక్కూడదు.. కానీ గెలికారు”. అంటూ సత్యదేవ్ పలికే పవర్ఫుల్ డైలాగులతో టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని టీజర్ లో చూపించారు.

- Advertisement -

ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు స్నేహితులు, ఓ విలన్ కి మధ్య జరిగే సంఘర్షనే ఈ కృష్ణమ్మ. మొత్తంగా కృష్ణమ్మ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. ఈ చిత్రం విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ ఫుల్ లెన్త్ యాక్షన్ లో తమ అభిమాన హీరోను చూడాలని సత్యదేవ్ ఫ్యాన్స్ చాలా ఆత్రుతంగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు