Krishnavamsi: ‘రంగ‌మార్తాండ‌’ పరిస్థితి ఏంటి ?

మ‌రాఠీలో మంచి పేరు తెచ్చుకున్న `న‌ట‌సామ్రాట్‌` ని తెలుగులో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ నానా పాటేకర్ పోషించిన పాత్రని తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, బ్రహ్మానందం వంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది. అభిషేక్ జావ్కర్, మధు కలిపు.. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీత దర్శకుడు. చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది.

10 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకున్న తరుణంలో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోవడం కృష్ణవంశీ అండ్ టీం ని డిజప్పాయింట్ చేసింది. దీంతో ఈ చిత్రం ఇక ఆగిపోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ నిర్మాతలకు డబ్బులు సెట్ అయ్యాయట. కాబట్టి మళ్ళీ షూటింగ్ ను ప్రారంభించి 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయాలని కృష్ణవంశీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందరి కాల్ షీట్లు అడ్జస్ట్ అవ్వాలి. ఏది ఏమైనా జూలై నెలలోపు షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆగస్టులో రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నట్లు వినికిడి. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని దర్శకుడు కృష్ణవంశీ భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు