MurariReRelease : రీ రిలీజ్ ప్రింట్ ను ట్రిమ్ చేస్తున్నారట.. కన్ఫర్మ్ చేసిన కృష్ణవంశీ

MurariReRelease : ఘట్టమనేని కృష్ణ వారసుడిగా వెండితెరకి పరిచయమైన మహేష్ బాబు సూపర్ స్టార్ గా అభిమానులను విశేషంగా అలరిస్తున్నాడు. పాతికేళ్లుగా మహేష్ బాబు తన సినిమాలతో ఎన్నో రికార్డులు, అవార్డులను సాధించాడు. అంతే కాక ఎన్నో చారిటిలతో ప్రజా సేవలతో ఎంతో మంది చిన్నారులకు సేవలనందిస్తున్నాడు. ఇక ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో వన్ మ్యాన్ షో తో మెప్పించి అదరగొట్టగా, త్వరలోనే ఎస్.ఎస్. రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఆగస్టు 9న పురస్కరించుకొని మహేష్ బాబు నటించిన ‘మురారి’ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతుందన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి రూపొందించిన ఈ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 9న రీ రిలీజ్ కి రెడీ అవుతుంది.

Krishnavanshi trimming 18 minutes of scenes in the Murari ReRelease print

 

- Advertisement -

4కే ప్రింట్ తో మురారి రీ రిలీజ్…

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ‘మురారి’ ఒకటి. మహేష్ బాబుకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాకుండా, నటన పరంగా మహేష్ ని ఎన్నో మెట్లు ఎక్కించింది. ఇప్పటికి టెలివిజన్ లో మురారి మంచి రేటింగ్స్ రాబడుతూ ఉంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. మ్యూజికల్ గానూ పెద్ద హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా ఆగష్టు 9న రీ రిలీజ్ అవుతూ అభిమానులను అలరించడానికి రెడీ అవుతుంది.

రీ రిలీజ్ ప్రింట్ ని ట్రిమ్ చేస్తున్న మేకర్స్…

అయితే తాజాగా మురారి సినిమాలో కొన్ని సన్నివేశాలని మేకర్స్ తొలగిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్నీ స్వయంగా డైరెక్టర్ కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. మురారి సినిమా మూడు గంటల సుదీర్ఘమైన నిడివి తో ఉంటుంది. అందువల్ల ప్రేక్షకులకు బోరింగ్ ఫీల్ కలగకుండా సినిమాలో చిన్న చిన్న బిట్లని రీ రిలీజ్ ప్రింట్ లో తొలగిస్తూ, దాదాపు 18 నిమిషాల సీన్లను సినిమానుండి తొలగిస్తున్నారట. ఈ విషయం కృష్ణవంశీ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. దీనిపై మహేష్ బాబు అభిమానులు కొంతమంది నిరాశలో ఉన్నారు. ఎందుకంటే సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది. ఏ సీన్లు తీసేయాల్సిన అవసరం లేదని కొంతమంది ఫ్యాన్స్ వాదన. మరి నిజంగానే కీలక సన్నివేవాలు తీసేస్తారా… లేక ఫైట్ సీన్లు. కామెడీ సీన్లలో ల్యాగ్ ఉండే సీన్లు ట్రిమ్ చేస్తారా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు