Custody :వరుసగా ఫ్లాపులు రావడంతో తెగించేసిన బేబమ్మ..!!

కన్నడ అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.

ఆ తర్వాత వరుసగా మూడు హిట్స్ తో హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేసుకుంది ఈ భామ. ఇక ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేసింది. ది వారియర్ సినిమాతో తొలి ఫ్లాప్ ని అందుకున్న కృతి, ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి చెప్పాలి.. ఇలా వరుసగా మూడు హ్యాట్రిక్ ఫ్లాప్స్ ని తన ఖాతాలో వేసుకుంది. హ్యాట్రిక్ విజయాలతో లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న బేబమ్మకు వరుసగా ఫ్లాపులు బేజారు తెప్పించాయి.

ఇక ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నాగచైతన్యతో కలిసి కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాతో కూడా మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇంకేముంది దీంతో సోషల్ మీడియాలో ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు. అయితే ఈ క్రమంలోనే ఎప్పుడూ లేని రేంజ్ లో కృతి శెట్టి బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

- Advertisement -

ఇటీవల ఓ ఇంటర్వూలో కూడా “బోల్డ్ కంటెంట్ చేసినంత మాత్రాన తప్పు కాదు కదా ” అంటూ తనని తాను సమర్థించుకుంది. ఈ క్రమంలోనే కృతి శెట్టి తన వద్దకు వచ్చే డైరెక్టర్ లు ఎలాంటి బోల్ట్ కంటెంట్ చెప్పినా సరే నిబంధనలు పెట్టకుండా చేస్తానంటుందట. ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా రెచ్చిపోయి మరి నటిస్తానని ఓపెన్ ఆఫర్స్ ఇస్తుందట కృతి. మరి చూడాలి ఈ అమ్మడు ఏ రేంజ్ లో బోల్డ్ అవబోతుందో..?

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు