Kushi: రీమేక్ సినిమా రీ రిలీజ్

ఒక భాషలో సూపర్ హిట్ అయినా సినిమాను మరో భాషలో రీమేక్ చేసి హిట్ కొట్టడం అంటే మాములు విషయం కాదు. ఒక సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వీపరీతమైన విమర్శలు వెతుకోవాల్సి వస్తుంది. కొన్ని ఒరిజినల్ సినిమాలకంటే వాటి రీమేక్ లు ఇంకా పెద్ద హిట్ అవుతుంటాయి. అలా లిస్ట్ తీస్తే పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా మొదటి ప్లేస్ లో ఉంటుంది.

తమిళ్ లో ఎస్. జె దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా, జ్యోతిక హీరోయిన్ గా 2000 సంవత్సరంలో తమిళ్ ఖుషి సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమాను తెలుగు లో పవన్ కళ్యాణ్ , భూమిక ను హీరోహీరోన్లుగా పెట్టి తెలుగులో ఖుషి పేరుతోనే రీమేక్ చేసాడు ఎస్.జె సూర్య. ఈ సినిమాలో కొన్ని కలకత్తా బ్యాక్డ్రాప్ ఎపిసోడ్ లు, ఏ మే రాజహా సాంగ్ ఇలా కొన్ని చేంజెస్ చేయడంతో ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

పవన్ కళ్యాణ్ లుక్స్, మేనరిజమ్స్, పెరఫార్మన్స్ ఇవన్నీ ఖుషి సినిమాలో పీక్ లో ఉంటాయి. ఇప్పుడు ఖుషి సినిమాను చూసిన అదే ఊపు వస్తుంది అటువంటి సినిమాను ఇప్పుడు మళ్ళీ థియేటర్ లో చూస్తే ఆ ఫీల్ వేరు కదా, సరిగ్గా అదే జరగబోతుంది. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఒక్కడు, పోకిరి, తమ్ముడు , జల్సా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఖుషి సినిమా వంతు వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఖుషి సినిమా రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు