Kushi:సమంత బ్యాక్ టు సెట్స్

ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సమంత… త్వరలోనే తను నటించిన శాకుంతలం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంచితే, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి ఖుషి. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఖుషి సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరి కాంబినేషన్ లో లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. నిన్ను కోరి మరియు మజిలీ ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా షూటింగ్ కు సంబంధించిన కొత్త అప్డేట్ లేకపోవడంతో చాలామంది ఫాన్స్, సినిమా ప్రియులు నిరాశలో మునిగిపోయారు. అయితే తాజాగా ఈ ఖుషి సినిమా అప్డేట్ అందించి అందరిలో జోష్ నింపాడు శివ నిర్మాణ.

అతి త్వరలోనే ఖుషి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది అంటూ ప్రకటించాడు. ప్రతి ఒక్కటి అందంగా ఉండబోతుందని… షూటింగ్ ను త్వరలోనే ప్రారంభిస్తామని శివ నిర్వాణ నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్ ఇస్తూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖుషి సినిమాలో కన్నడ యాక్టర్ జయరాం, సచిన్ కడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, ఆలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగారు, శరణ్య ప్రదీప్ ఇలా చాలామంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు