Malobika Banerjee : లైగర్ టీజర్ ను చూసి నవ్వుకున్నా..

బెంగాలి నటి, సింగర్ మలోబిక బెనర్జీ లైగర్ చిత్రం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి ముందు విజయ్ తాను మంచి ఫ్రెండ్స్ అని, తాము నీ వెనకాలే నడిచి అనే మ్యూజిక్ ఆల్బమ్ లో కలిసి పని చేశామని చెప్పింది. అప్పటి నుంచి తాము మంచి స్నేహితులుగా ఉన్నామని తెలిపింది. అయితే విజయ్ కి హిందీ రాద‌ని, తాను హిందీ మాట్లాడితే హేళన చేసేవాడని గుర్తు చేసుకుంది.

అలాంటి వాడు తన లైగర్ సినిమాను హిందీలో చేస్తున్నాడంటే తాను నమ్మలేకపోయానని చెప్పింది. తర్వాత లైగర్ టీజర్ ను చూసి నవ్వుకున్నట్టు చెప్పుకొచ్చింది. అప్పుడే విజయ్ కి చెప్పాలని అనుకుందట. కానీ ఆ పని చేయలేక, ఆ టీజర్ ను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసిందట. ఈ చిత్రం విడుదలైన సమయంలో కూడా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు వివరించింది. ఇక సినిమా చూసిన తర్వాత.. విజయ్ కి పెద్దగా డైలాగ్స్ లేవని, అందుకే హిందీలో రిలీజ్ చేశారని తనకు అర్థమైందని చెప్పింది.

అయితే గత కొద్ది రోజుల నుంచి లైగర్ చిత్రం విషయంలో పూరి జగన్నాథ్ కు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు మధ్య నష్టాల విషయంలో అనేక విషయాలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మైంది పై పూరి కేసు కూడా నమోదు చేశాడు. ఈ సందర్భంలో నటి, సింగర్ మలోబిక బెనర్జీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు