Lavanya Tripathi : ఫుల్ బిజీ

అందాల రాక్ష‌సి తో తెలుగు ప్రేక్షకులకు అందాల రాశిగా మారిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈమె తక్కువ కాలంలోనే చాలా ఫేమస్ అయింది. ఒక సమయంలో తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగింది. గత ఏడాది ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా అనే సినిమాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఈ సంవత్సరం హ్యపీ బర్త్ డే అనే చిత్రంలో నటించింది. దీనిలో ఈమె రెండు విభిన్న పాత్రలు చేసింది. అయినప్ప‌టికీ ఈ సినిమా పెద్ద విజయం ఏం సాధించలేదు.

అయినా లావణ్య త్రిపాఠికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తమిళంలో హీరో అధర్వ తో ఒక సినిమా చేస్తోంది. దీని షూటింగ్ రెండు పాటలు మినహా దాదాపు పూర్తి అయింది. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఒక చిత్రం చేస్తోంది. దీనికి మంజునాథ్ దర్శకత్వ బాధ్యత వహిస్తున్నారు.

ఇది సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తుంది. దీంతో పాటు జీ 5 తెరకెక్కిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది. దీనికి ‘పులి మేక’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ వెబ్ సిరీస్ కు కోన వెంకట్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇలా లావణ్య త్రిపాఠి రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ తో ఫుల్ బిజీగా ఉంది. ఇవి హిట్ అయితే ఈమెకు మరిన్నీ అవకాశాలు కూడా రావొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు