Leo: ఇంటర్నెట్ లో ఈ జంట ఫోటోలు వైరల్

ఖాకీ, మాస్టర్, విక్రమ్ వంటి సినిమాలతో దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపును ఏర్పరచుకున్న యంగ్ డైరెక్టర్ ‘లోకేష్ కానగరాజ్’ ప్రస్తుతం దళపతి విజయ్ తో చేస్తున్న సినిమా ”లియో”. ఇది వరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ సినిమా కు వచ్చిన సక్సెస్ ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయి లో ఉంచింది.

ఇక ఈ సినిమా లో విజయ్ సరసన ‘త్రిష కృష్ణన్’ నటించబోతుందని మేకర్స్ ఇదివరకే తెలిపారు. ఈ జంట ఇది వరకే ‘ఝీల్’ అనే సినిమా తో ప్రేక్షకులకి పరిచయం అయి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక 14 ఏళ్ల తరువాత మళ్ళి ఈ సినిమా తో తెర మీద కనిపించనున్నారు. దీనితో ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా లో అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సంజయ్ దత్, వంటి ఎంతో మంది స్టార్ కాస్ట్ కూడా కనిపించనున్నారని మేకర్స్ అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయ్, త్రిష ఓ ఫ్యాన్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

- Advertisement -

త్రిష విజయ్ జోడీని మళ్ళి తెర మీద చూసేందుకు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి ఈ ఫోటో ఫీస్ట్ అయింది. వీరి జోడికి ఉన్న క్రేజ్ అలాంటిది…. ఒక ఫోటో నే ఇంత వైరల్ అవుతుంటే, ఇక ఈ సినిమా ఇంకెంత భారీ స్థాయి లో బాక్స్ ఆఫీస్ ను రాణిస్తుందో చూడాల్సి ఉంది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు