Vijay : బ్రేక్ ఈవెన్ కష్టమేనా ?

కరోనా మహమ్మారి తర్వాత సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రేక్షకులు థియేటర్ ల కంటే, ఓటీటీలకే ప్రధాన్యత ఇవ్వడం వల్ల సినీ ఇండస్ట్రీల మనుగడకే ప్రమాదం ఏర్పడింది. భారీ బడ్జెట్ తో వచ్చే సినిమాలను కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో థియేటర్ లు ప్రేక్షకులు లేక విలవిలలాడుతూ కనిపించాయి. తెలుగులో సీతారామం, బింబిసార సినిమాలు వచ్చిన తర్వాత, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ కు కదులుతారు అని తెలిసింది.

క్రేజ్ ఉన్న హీరో, హీరోయిన్, డైరెక్టర్ లు ఉన్నా, భారీ బడ్జెట్ తో తెరకెక్కించినా, కంటెంట్ బాగలేకుంటే.. డిజాస్టారే అని ఇప్పటి వరకు చాలా సార్లు ప్రూవ్ అయింది. తాజాగా లైగర్ సినిమాకు కూడా ఇదే జరిగింది. దేశ వ్యాప్తంగా పాపులారిటీ సాధించిన విజయ్ దేవరకొండ, బాలీవుడ్ నటి అనన్యపాండే, అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ నటించినా, మాస్ సినిమాలకు కేర్ఆఫ్ ఆడ్రస్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించినా లైగర్ సినిమాను ప్రేక్షకులు తొంగిచూడటం లేదు.

ఆగస్టు 25న పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన లైగర్ మొదటి షోకే డిజాస్టార్ అని తేలిపోయింది. తొలి రోజు 32 కోట్ల గ్రాస్ వచ్చినా, సినిమా టాక్ బయటకు వచ్చిన తర్వాత అలాంటి కలెక్షన్లు కనిపించడం లేదు. నిజానికి లైగర్ మేకర్స్ ఈ వీకెండ్ లో సినిమాకు భారీ కలెక్షన్లు వస్తాయని భావించారు. కానీ, తెలుగుతో పాటు అన్ని సెంటర్ లలో వసూళ్లు పెద్దగా రాలేవు.

- Advertisement -

4 రోజుల్లో లైగర్ వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజం : 5.90 కోట్లు
సీడెడ్ : 1.83 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.72 కోట్లు
గుంటూరు : 1.00 కోట్లు
తూర్పు : 0.89 కోట్లు
కృష్ణ : 0.69 కోట్లు
వెస్ట్ : 0.58 కోట్లు
నెల్లూరు : 0.54 కోట్లు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో 13.15 కోట్ల షేర్, 22 కోట్ల గ్రాస్

కర్ణాటక : 1.65 కోట్లు
ఓవర్సీస్ : 3.50 కోట్లు
ఇతర భాషలలో : 7 కోట్ల షేర్, 18 కోట్ల గ్రాస్
ప్రపంచ వ్యాప్తంగా 26.30 కోట్ల షేర్, 51.50 కోట్ల గ్రాస్

అయితే లైగర్ సినిమాకు బ్రేక్ ఈవెన్ పాయింట్ 90 కోట్ల వద్ద ఉంది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాలు తెచ్చుకోవలంటే, ఇంకా 65.56 కోట్ల వసూళ్లు చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో లైగర్ బ్రేక్ ఈవెన్ రాబట్టడం దాదాపు కష్టమే అని చెప్పచ్చు. అంతే కాదు భారీ స్థాయిలో నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉందని సినీ క్రిటిక్స్ జోస్యం చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు