Custody: షూట్ ఈజీనే.. ప్రాబ్లమ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్‌తోనే?

అక్కినేని కుటుంబ పరువుని నిలబెట్టడానికి నాగ చైతన్య ఈ వారం కస్టడీతో వస్తున్నాడు. అక్కినేని హీరోలు నాగార్జున నుంచి ఇటీవల వచ్చిన ఘోస్ట్.. అఖిల్ నుంచి తాజాగా వచ్చిన ఏజెంట్ దారుణమైన ఫలితాన్ని ఇచ్చాయి. ఈ సినిమాలపై అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఈ మూవీస్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లపడ్డాయి. దీంతో అక్కినేని వారి పరువు మొత్తం పోయింది. అయితే నాగ చైతన్య నుంచి ఈ శుక్రవారం రాబోతున్న కస్టడీ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రం సూపర్ హిట్ అయి, అక్కినేని కుటుంబ పరువును నిలబెడుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుకూలంగా, నాగ చైతన్య ప్రమోషన్స్ కూడా ఫుల్ జోష్ లో చేస్తున్నాడు. చైతన్యతో పాటు హీరోయిన్ కృతి శెట్టి కూడా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొంటుంది. కృతి శెట్టి ఇప్పటి వరకు చేసిన సినిమాలకు ప్రమోషన్స్ చేసింది. అయితే, కస్టడీకి మాత్రం కొంత ఎక్కువే కష్టపడుతుంది. కానీ, డైరెక్టర్ వెంకట్ ప్రభు మాత్రం ప్రమోషన్స్ లో చాలా తక్కువ సార్లు కనిపిస్తున్నాడు.

కారణమేంటంటే.. కస్టడీ షూట్ ను త్వరగానే పూర్తి చేసినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయట. ఓ వైపు, ప్రమోషన్స్ చేస్తూనే, మరో వైపు డైరెక్టర్ వెంకట్ ప్రభు.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటున్నాడని సమాచారం. కస్టడీలో కొన్ని సన్నివేశాలకు సీజీ వర్క్ ఇప్పటి వరకు జరిగిందట. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యమైందని స్వయంగా నిర్మాతే ఓ సందర్భంలో చెప్పారు. దీని వల్లే ఓవర్సీస్ కు వెళ్లాల్సిన కంటెంట్ కూడా ఆగిపోయిందట. అన్ని పనులు పూర్తి చేసి, నిన్న రాత్రి ఓవర్సీస్ కు కంటెంట్ ను పంపించారని తెలుస్తుంది.

- Advertisement -

ఇలా అనుకున్న డేట్ కి సినిమాను రిలీజ్ చేయాలని మూవీ టీంతో పాటు డైరెక్టర్ వెంకట్ ప్రభు చాలానే కష్టపడ్డారని టాక్ వినిపిస్తుంది. ఇటీవల ఏజెంట్ సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. షూట్ ను పూర్తి చేశారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఆలస్యమయ్యాయి. కానీ, అప్పుడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ఇటు ప్రమోషన్స్ చేస్తూనే, పోస్ట్ ప్రొడక్షన్ పనులను చూసుకున్నాడు. ఈ రెండు సినిమాల పరిస్థితి చూసైనా, రాబోయే చిత్రాల యూనిట్లు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయాన్ని కేటాయించకోవాలి. అలా చేయకపోతే, ఎంతో కష్టపడి చేసిన సినిమా ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు