Nani : లైన్ క్లియర్

నేచురల్ స్టార్ నాని కమర్షియల్ హిట్టు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. నాని కెరీర్ లో ఇప్పటివరకు తీసినవన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్నంగాా ఉంటాయి. ఇటీవల విడుదలైన “అంటే సుందరానికి” చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. తాజాగా నాని హీరోగా చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా”. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు.

మాస్ ఎలిమెంట్స్ ఉండే సన్నివేశాలతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి దసరా ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పాయి.

వీలైనంత త్వరగా ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇటీవల తెలుగు సినీ నిర్మాతలు టాలీవుడ్ లో జరుగుతున్న షూటింగ్ లను నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగు ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

దీంతో తెలుగు సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. అయితే తాజాగా నాని నటిస్తున్న “దసరా” సినిమాకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. ఆగస్టు 18 నుంచి దసరా షూటింగ్ జరుపుకోవడానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో రేపటి నుంచి దసరా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు