Vijay-Rashmika : దొరికిపోయారు..

విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా మధ్య ఏం ఉంది.. ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇది. నిజానికి ఈ టాపిక్ చాలా రోజలు నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనిపై రష్మిక, విజయ్ పలుమార్లు క్లారిటీ ఇచ్చినా, మళ్లీ తెరపైకి వస్తున్నాయి. దీనికి నెటిజన్లు మాత్రమే కాదు.. విజయ్, రష్మిక కూడా. వీరి మధ్యలో ఏదో ఉంది అనే అనుమానాన్ని ఇప్పటికే చాలా సందర్బాల్లో వీళ్లే క్రియేట్ చేశారు.

తాజాగా ఈ నెల 7న విజయ్, రష్మిక ముంబై ఎయిర్ పోర్టులో ఒకే సమయంలో కనిపించారు. ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ ఇద్దరు వేరే వేరే మార్గాల్లో వెళ్లినా.. వీళ్లు సిక్రెట్ గా మాల్దీవులకు వెళ్లారని గుసగుసలు వినిపించాయి. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్. దీన్ని కాస్త మరిచిపోతున్న సమయంలో మరొకటి వచ్చి చేరింది. దీంతో విజయ్-రష్మిక మధ్య ఏదో ఉందని ఈ సారి నెటిజన్లు చాలా బలంగా నమ్ముతున్నారు.

అదేంటంటే.. మాల్దీవుల్లో రష్మికా మందన్నా.. స్విమ్మింగ్ ఫుల్ వద్ద కూర్చొని ఒక రొమాంటిక్ ఫోజ్ ఇచ్చిన ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యేక్షమైంది. ఈ ఫోటో నార్మల్ గా ఉంటే ఎలాంటి సమస్య వచ్చేది కాదు. కానీ ఇందులో నేషనల్ క్రష్ ఒక కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది. ఇక్కడే వీరి బండారం బయటపడింది. సరిగ్గా 7వ తేదీన ముంబై ఎయిర్ పోర్ట్ లో అచ్చం ఇలాంటి కూలింగ్ గ్లాసెస్ ను విజయ్ దేవరకొండ ధరించి కనిపించాడు.

- Advertisement -

ఇప్పుడు ఈ రెండు ఫోటోలను చూపిస్తూ.. రష్మిక ధరించిన కూలింగ్ గ్లాసెస్ విజయ్ దేవరకొండవే అంటూ కామెంట్ చేస్తున్నారు. వీరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం గ్లాసెస్ తో బయట పడింది అంటూ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. “ఇన్ని సార్లు దొరికిపోయినా.. ఇంకా ఎందుకు దాస్తున్నారు. ఈ గుడ్ న్యూస్ ను ఫ్యాన్స్ కు అధికారికంగా చెప్పాలి” అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు