Love Today: డబ్బింగ్ సినిమాకే ఎక్కువ

ఈ మధ్యకాలంలో భాష తో సంబంధం లేకుండా ఆడియన్స్ అన్ని సినిమాలు చూస్తున్నారు. ఓటిటి లు వచ్చిన తరవాత ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్న సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి చూస్తున్నారు.బాహుబలి సినిమా తరువాత సినిమాకు ఎల్లలు, బోర్డర్స్ లాంటివి దాదాపు చెరిగిపోయాయి. ఇప్పుడంతా పాన్ ఇండియా పాన్ ఇండియా అయిపోయింది.

అలానే రీసెంట్ టైమ్స్ లో వేరే లాంగ్వేజ్ లో ఒక మంచి సినిమా వస్తే దానిని వెంటనే తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు ఇప్పటి అగ్ర నిర్మాతలు.
కాంతార సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేసి భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా దాదాపుగా 60 కోట్లు పైగా వసూళ్లు సాధించింది.
“కాంతార” భారీ విజయం తరువాత “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ఇప్పుడు వరుణ్ ధావన్, కృతి సనన్ నటిస్తున్న “భేదియా” చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించింది. తెలుగులో “తోడేలు” పేరుతో ఈ సినిమాను నవంబర్ 25 న భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసింది.

తమిళ్ లో రీసెంట్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం “లవ్ టుడే” ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ రెండు డబ్బింగ్ సినిమాలతో పాటు అల్లరి నరేష్ తెలుగులో నటించిన “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే అల్లరి నరేష్ నటిస్తున్న తెలుగు సినిమా మొదటిరోజు హైదరాబాద్ 228 & వైజాగ్ లో 60 షోస్ పడుతున్నాయి.
లవ్ టుడే డబ్బింగ్ సినిమా హైదరాబాద్ 238 & వైజాగ్ లో 80 షోస్ పడుతున్నాయి. అంటే డైరెక్ట్ తెలుగు ఫిలిం కంటే ఒక డబ్బింగ్ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని మనకు అర్ధమవుతుంది. ఇటీవలే వరిసు సినిమా విషయంలో కామెంట్స్ చేసిన లింగుస్వామి వంటి తమిళ్ దర్శకులు ఈ విషయంపై  ఎలా ఫీల్ అవుతారో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు